Kalavedika

Telugu Film News | Reviews | Interviews

సరిలేరు నీకెవ్వరు” తారకరామా..!

పురాణపాత్రల్లో దేవుడవై అవతరించావు,
జానపద చిత్రాలకు రారాజువై వెలిగావు,
చారిత్రాత్మక కథల్లో నాయకుడిగా నిలిచావు.

సాంఘిక చిత్రాల్లో కథానాయకుడిగా,
రాజువైనా పేదవైనా సమానంగా జీవించావు—
రిక్షా రాముడై, కురువృద్ధుడు భీష్ముడై,
బడిపంతులిగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచావు.

తెలుగింటి ఆడపడుచులకు
రక్తసంబంధాన్ని మించిన అన్నయ్యవై
హారతులు అందుకున్న అపూర్వ వ్యక్తిత్వం నీది.

దేశభక్తిలో, ప్రజాసేవలో
నీకు సాటి లేరు మరెవ్వరూ…
అందుకే అయ్యావు
తెలుగు జాతికి ఒక యుగపురుషుడివి.

గ్రేట్ ఎన్టీఆర్ 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »