నవ్వులు పంచబోతున్న ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’… ట్రైలర్ విడుదల
Sampradayini Suppini Suddapoosani చిత్రంలో సీనియర్ హీరోయిన్ Laya కీలక పాత్రలో నటించగా, రోహన్, ప్రిన్స్, అలీ, ధన్‌రాజ్, ఇమ్మాన్యూయేల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి Sudheer Sriram దర్శకత్వం వహించగా, Ranjin Raj సంగీతం అందించారు.
ట్రైలర్‌లో వినోదం, కుటుంబ భావోద్వేగాలు, హాస్యభరిత సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్ చూసిన అనిల్ రావిపూడి, దర్శకుడి రైటింగ్ మరియు ప్రెజెంటేషన్‌పై ప్రశంసలు కురిపించారు. లయ సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి పాత్రతో ప్రేక్షకులను మెప్పిస్తారని అన్నారు.
నిర్మాత శివాజీ మాట్లాడుతూ, ఈ సినిమాను పూర్తి టీమ్ వర్క్‌తో తెరకెక్కించామని తెలిపారు. డైరెక్టర్ సుధీర్ శ్రీరామ్ ఈ చిత్రం తన కెరీర్‌లో ప్రత్యేకమైందని పేర్కొన్నారు.
Sampradayini Suppini Suddapoosani OTT Release కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఫిబ్రవరి 12న ETV Winలో పూర్తి కుటుంబ వినోదం అందుబాటులోకి రానుంది.
Leave a Reply